రాలిపడిన కన్నీటి చుక్క
నిశ్శబ్ద వీణ తంత్రుల సవ్వడిలో
వినిపించింది ఒక మౌనరాగం
గుండె గొంతుకను చీల్చి
గాలిలో కలిసిపోయింది ఒక
ఆర్తనాదం
కన్నుల మైదానంలో వికసించి
గుండె లోయల్లో జారిపడింది
ఒక సుందర స్వప్నం
ఎదలోయలలో అగ్నికి కాలిపోయి
బూడిదగా రాలిపోయింది
ఒక కలల సౌధం
కూలిన సౌధంలో ఆరిపోయింది
ఒక ఆశాదీపం
ఆవిరవుతున్న జ్ఞాపకాల వెల్లువలో
మౌనంగానే జారిపడింది
ఒక కన్నీటి చుక్క
నిశ్శబ్దంగా పరుచుకుంటున్న
నిశిరాతిరిలా....
No comments:
Post a Comment