భావసమాధి
ఆగిపోతాయ్ నా రాతలు
విరిగిపోతాయ్ నా అక్షరాలు
సమాధి అవుతాయ్ నా భావాలు
అంతం లేనిది లేనే లేదు సృష్టిలో
నాశనం కానిది పుట్టలేదు జగతిలో
ఆది ఉన్న చోటే అంతమున్నది
కాల చక్రం నడిపే దినకరుడూ
ఆరిపోతాడు
చల్లని వెన్నెల జాబిలీ
నల్లబడతాడు
సముద్రాలు పొంగుతాయ్
పుడమి మునుగుతుంది
సృష్టి ఉన్నప్పుడు
అంతమూ ఉంటుంది
నాలోని భావాలకూ అంతమున్నది
నా అక్షరాలకూ పరిమితి ఉన్నది
నా రాతలకూ ముగింపు ఉన్నది
నా మనసు స్పందనలు నడిచేవరకూ
నా ఊపిరి శ్వాసలు నింపుకునేవరకూ
నా మస్తిష్కం రొదలు పెట్టే వరకూ
నా భావాలు పురివిప్పుతాయ్
నా అక్షరాలు రెక్కలు
విచ్చుకుంటాయ్
ఎవరికీ నచ్చని నా అక్షరాలు
నాతోనే మరణిస్తాయ్
ఆగిపోయే నా శ్వాసలోనే
నా అక్షరాపుష్పాలు
సమాధి అవుతాయ్
No comments:
Post a Comment