సింహం నవ్వితే?
మీరు బతికి ఉన్న చోట
అదే ప్రపంచమని అనుకుంటారు
బావిలో కప్పలు మీరు
అరకప్పునీటీనే సునామీ
అనుకుంటారు
పిల్ల కాలువలో ఈదుతూ
సముద్రాన్నే దాటేసామని పొంగిపోతారు
కుక్కమూతి పిందెలు మీరు
సింహం గురించి ఆరా తీస్తారు
కుక్కలను వేటాడదు సింహం
సింహం కలలోకి వస్తేనే
ఉలిక్కిపడే
పిరికిబందలు
ఎలా ఉన్నానో అని ఆరాలు తీయటం
కాదు
గుండె దిటవు చేసుకుని
సింహం ముందుకు రండి
ఎవరినో అడిగి తెలుసుకోవటం
దేనికి
సింహాన్నే అడగండి
సింహం నవ్వితే
ఆ గర్జన కే గుండెపగిలి చస్తారు
నీతి జాతి లేని మీరు
చీకటి పనులే జీవితమని నమ్మే
మీరు
అమాయకుల జీవితాలతో
చెలగాటమాడే మీరు
మృగరాజు గురించి ఆలోచించటం
ఆకాశంలో నక్షత్రాలు లెక్కించటమే
మనసు ముందు మ్రోకరిల్లిన సింహం
తట్టి లేపితే సింహ స్వప్నమే
అవుతుంది
నిజానికి సివంగి పంజాకే
నిద్రలేని రాత్రులు గడుపుతున్న
కుక్కలు
సింహం జోలికి వస్తే ...
సివంగి చాలురా
మీ కుక్క బతుకులకి
No comments:
Post a Comment