మహర్షికి సలాం
ఓ మహర్షీ
జాతి మరువదు నీఖ్యాతిని
ఓ దార్శనికుడా
నీ అడుగుజాడలే మాకు
కరదీపికలు
ఓ మేధావీ
నీ మహోన్నత ఆలోచనలే మా
లక్ష్యాలు
ఓ స్వాప్నికుడా
నీ స్వప్నాలే భరతమాత
సిగలో పుష్పాలు
ఓ వైజ్ఞానికుడా
నీ ఆవిష్కరణలే మాకు
ఆయుధాలు
ముకుళిత హస్తాలతో మనసు
ప్రణమిల్లుతోంది
మహాత్మా నీవు మాలో
లేకున్నా
నీ ఆలోచనలు నిత్యం
మాతోనే ఉంటాయి
భారతజాతి చరిత్రలో
నువ్వు నిత్యం
వికసిస్తూనే ఉంటావు
నా దేశ భవితను నీవు
చేయి పట్టుకుని
నడిపిస్తావు
నా జాతి విజయంలో
మళ్ళీ మళ్ళీ పుడుతావు
కలాం నీకు నాదేశం
అందిస్తోంది సలాం
No comments:
Post a Comment