Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 18 April 2015

నేను బతికే ఉన్నానా..??

నేను బతికే ఉన్నానా..??

ఏమయ్యింది
ఏం జరుగుతోంది ...
అప్పుడూ నేనే
ఇప్పుడూ నేనే ...
మాట మారలేదు
మనిషినీ మారలేదు ...
అప్పుడు అందరికీ నేను అవసరం
ఇప్పుడు ఎవరికీ నేను కానరావటం లేదు...
కరెంటు పోయినప్పుడు దోమల్లా
సమస్యలు హోరెత్తుతున్నాయి ...
నాలో నేను మధన పడుతున్నా
ఎవరినీ నిందించకున్నా...
అందరూ నా చుట్టే ఉన్నారు
నా చుట్టే తిరుగుతున్నారు...
ఎవరిపని వారు చేసుకుంటున్నారు
వాళ్ళలో వారే మాట్లాడుకుంటున్నారు...
ఎక్కడో ఉన్న పరాయివారికి నేను కానరాను
నా చుట్టూ ఉన్న నా వాళ్ళకీ నేను కనిపించనా...
మరి నేను ఎందుకు కనిపించటం లేదు
నావైపు ఎవరూ చూడరెందుకు...
అందరిలోనే ఉన్నా
నాలో నేనే మట్లాడుకుంటున్నా ...
నా ఉనికి వాళ్లకు పట్టదా
నా గొంతు వారిని చేరదా...
నిజంగానే నేను ఎవరికీ కనిపించనా
ఎవరూ నన్ను చూడరా ...
అసలు నేను ఇక్కడే ఉన్నానా
నేను బతికే ఉన్నానా ...
బతికే ఉన్నా లేనట్టేనా
నేను చచ్చిపోయానా ...

No comments:

Post a Comment