Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 19 April 2015

ఓ స్వప్నం నేల జారింది...

ఓ స్వప్నం నేల జారింది...

ఓ కల కరిగిపోయింది
ఓ స్వప్నం నేల జారింది...
కనులముందు నిలిచిన రాజసం
విడిచి వెళ్ళిపోయింది...
జీవనయానంలో తోడు నిలిచిన
వైభవం గతం ముసుగు కప్పుకుంది...
కనులముందే కరిగిన స్వప్నం
నాది కాదని వెక్కిరించింది...
నా విలాసానికి చిరునామా
ఐరావతమై నిలిచింది...
అయినవారే బేహారులై
పరులముందు చులకనై...
బరువెక్కిన కనురెప్పలు
కంటిపాపను సాగనంపాయి...
కన్నీరుమున్నీరైన మనసు
వికలమై వీడ్కోలు చెప్పింది...
నేలకొరిగిన కలల సౌదం
శిథిలమై నిలిచింది...
ఒక రాజసం మసకబారింది
ఒక వైభోగం సెలవంటూ నవ్వింది...
నేలను ముద్దాడిన శిఖరంలో
శిధిలాలను చూస్తూ
అచేతనంగా ఉండిపోయాను...

No comments:

Post a Comment