Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 23 April 2015

పిచ్చిమనసా ఎందుకే నీకు ఆరాటం

పిచ్చిమనసా ఎందుకే నీకు ఆరాటం



నీవు మనస్సువా నాలోని మనిషివా..
నా మనసులోని మనిషివా
లేక నా అంతరాత్మవా...
నాలో నిండి ఉన్న మనస్సువేనా
నాలోనే నువ్వా
నేనంటేనే నువ్వా...
ఓసి మనసా
నేనంటేనే అలుసా...
ఎందుకు నాతో చెలగాటం
ఎందుకు ఇంకా ఆరాటం ...
గడిచిన క్షణం
అది తిరిగిరాని గతం ...
విడిచిన ఊపిరి మళ్ళీ శ్వాసగా
ఉదయిస్తుందేమోగానీ
కాలం ఎన్నటికీ తిరిగిరానిదని
నీకు మాత్రం తెలియదా...
మనసులో మనసులా
నాలోనే నేనులా
తోడు నడిచిన గతం
తన అడుగుజాడలే తుడిచివేస్తే...
చేతిలో చెయ్యి వేసి చేసిన బాసలను
చిదిమేసిన చెయ్యి విడిచిపోతే...
మారుతున్న కాలం సాక్షిగా
తను నాది కాదనీ
ఎన్నటికీ తిరిగిరాదనీ
నీకు మాత్రం తెలియనిదా...
తనది కానిది
పరాయిదేనని గమనించజాలవా ...
నిన్ను విడిచిన గతం
ఎన్నటికీ తిరిగిరాదు
అది ఎన్నటికీ
నీది కాబోదు...
ఎందుకే నీకు ఇంకా తపన
ఓసీ పిచ్చి మనసా...

No comments:

Post a Comment