Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 4 April 2015

మిషన్ మనీ



మిషన్ మనీ


మనీకి మనసుకు లింకు ఉందా
విటమిన్ ఎమ్ ప్రవహిస్తేనే
మనసులో స్పందనలు పుడతాయా ...
మనసైన మనసును
మనసులో నింపుకోవాలంటే
మనసులో ప్రేమ దీపం వెలగాలంటే
మనీ ఇంధనం కావాల్సిందేనా ...
ప్లాస్టిక్ పువ్వుకు
మనీ పరిమళాలు అద్దితే
అది వికసిస్తుందా...
బ్రతికేందుకు మనీ అవసరమే గానీ
ప్రేమించేందుకూ మనీ అవసరమేనా...
కాణి గానివాడిని కాంతైనా గాంచదు
ఇది నిజమేనా ...
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే
మార్క్స్ బాబు చెప్పింది నిజమేనా..
మనీ ఉంటే ఒకలా
మనీ లేకపోతే మరోలా
ప్రేమిస్తారా ఎవరైనా...
అది నిజంగా ప్రేమేనా
అది నిజంగా మనసేనా
లేక “మనీ” సేవేనా ...
బంధానికీ అనుబంధానికీ
కొలమానం మనీయేనా...
నాది కాదు మనీ మనసు...
మనీ శాస్త్రం చదువుకోలేదు నేను...
మట్టిలో పుట్టిన పువ్వును నేను...
మట్టిలో విరిసిన మమతను నేను
మట్టిలోనే గడిచిన జీవితాన్ని నేను...
మనీతో లింకు లేని మనసు నాది ...
మనీ లేకుండానే ప్రేమించా
మనీ లేకున్నా ప్రేమిస్తా...
మనసుకు విలువ ఇవ్వని మనీ నాకు గడ్డిపోచే..
అనుమానాల్ని అవమానాల్ని
కానుకగా ఇచ్చే మనీ
వద్దే వద్దు నాకు...
డబ్బులో పుట్టి
డబ్బులో పెరగలేదు నేను...
మట్టిలో పుట్టి
మట్టిలో కలిసిపోయే
మట్టి పువ్వును నేను
మనస్వినీ...

2 comments:

  1. చెప్పవలసింది మనసుతో చెబుతారు అందుకే అంతందంగా అమరుతాయి అక్షరాలు. చాలా బాగుందండి.

    ReplyDelete