Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 14 April 2015

సమాధిరాళ్ళు...

సమాధిరాళ్ళు...


షాజహాన్ లా తాజ్ మహల్ కట్టాలనుకోలేదు...ఏయన్నార్ లా ప్రేమనగర్
నిర్మించాలని అనుకోలేదు...అక్బర్ లా స్వంతమతం కోసం ప్రాకులాడలేదు...కేవలం మనో లోకంలో ప్రేమ మందిరం కట్టుకోవాలనుకున్నాను ...ఊహా తెలిసిన నాటి నుంచి నా ప్రతి ఊహా ప్రేమ చుట్టే తిరిగింది..కనిపించని ఊహా సుందరికోసమే గుండె గుడికి పునాది వేసాను...పూదోటలో విరిసిన పువ్వులను పునాది రాళ్ళుగా మలుచుకుని
కొంచెం కొంచెం నిర్మాణం తలపెట్టాను...నాలుగు దిక్కులు గోడలుగా నీలాకాశం పైకప్పుగా సువిశాల ప్రేమ మందిరం నిర్మించేందుకు శ్రీకారం
చుట్టాను...ఈడు విరిసినా బాధ్యతలు చుట్టుముట్టినా నా ప్రేమ మందిరానికి
కూలీ పని ఆపలేదు..మనసైన మనసును కొలువుదీర్చాలన్న తపన ఆపుకోలేదు..కాలం తిరుగుతున్నా క్యాలెండర్ తేదీలు జెట్ స్పీడ్ లో మారుతున్నా మనసు మనసైన మనసుకోసం అన్వేషణ ఆపలేదు..మనసు కోవెలకోసం  ఈషణ తప్పలేదు..
ముళ్ళు గుచ్చుకున్నా రుధిరం ధారలై ప్రవహిస్తున్నా ప్రేమ మందిరం పనులు ఆగలేదు..బండరాళ్లనే పువ్వులుగా భావించి ఒక్కోక్కటిగా పేర్చుకుంటూ పోయాను..ప్రేమ మందిరానికి పునాదిరాళ్ళు మోస్తున్న నేను అవి నా సమాధి రాళ్ళని తెలుసుకోలేక పోయా...

No comments:

Post a Comment