Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 14 January 2016

జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమా

జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమా

చిగురు తొడుగుతున్న
నవ వసంతం లో
పులకించే మారాకు తనం తను......
పచ్చదనాల కురులను సుతారంగా మీటే
చిరుగాలి తను....
ఆనందమైనా
అనురాగమైనా
అది లాలిత్య మైనా
ఏదైనా పంచివ్వ గల
మంచి మనసు తను...
కన్నీటి సుడుల నుండి జారుతున్న
నులి వెచ్చని కన్నీటి బిందువు తను.....
నా చిరునవ్వుల రతనాల నుంచి
జారి పడుతున్న ఓ మెరుపు చుక్క తను.....
జీవన పయనం లో జతకాడిలా......
తోడూ నీడ గా.... కలిసి నడుస్తున్న
మనసైన సహచరుడు తను.....
ఆ రెండు ప్రతిరూపాలు.....
వారి నవ్వుల కేరింతలు....
అన్నింటిలో తను.....
అంతెందుకు.... నాలో....
అణువణువున యిమిడి వున్నది తను....
నా ప్రతిక్షణం
ప్రతి అలోచనలల్లో తను.....
నా కుటుంబం లోని
నా పిల్లల్లోని ప్రతి నీడలో తను.....
నిజమే ఇది
నా సర్వస్వం తను....
నన్ను నన్నుగా ప్రేమించిన నా మనోవల్లబుడు తను.....
అవును నన్ను మనస్వినిగా మలుచుకున్న నా వల్లబుడికి నా మనసు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ చెబుతుంది జన్మదిన శుభాకాంక్షలు...

    -మీ మనస్విని (వాణి శ్రీ విద్య)

No comments:

Post a Comment