Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 17 January 2016

ఆకాశమా క్షమించు

ఆకాశమా క్షమించు
 
నీకు నీకు నీకు
అందరికీ
ప్రతి ఒక్కరికీ
అవును మీ అందరికీ
పేరు పేరునా
మీ అందరికీ
అవును
మీ అందరికీ
తప్పు చేసిన మనసు
మన్ననలు కోరుతోంది
తెలుసుకోండి
మట్టి మనిషిని నేను
మట్టి మనసే నాది
మట్టి మనసు ఆలోచనలు
మట్టి వాసనే వేస్తాయి
భువి నుండి దివికి నిచ్చెనలు వేసినా
నేల వీడి నింగిన విహరించినా
జారిపడేది నేలపైనే
నిజం గ్రహించలేని మనసుదే గ్రహపాటు
నింగిదేముంది పొరపాటు
స్థాయిని తెలియని మనసు
రెక్కలు కట్టుకుంది
ఆకాశవీధిలో ఉరిమే మేఘాలు
దహనం చేస్తాయనీ
రాబందులు పలహారం చేస్తాయనీ
ఊహించలేకపోయింది
నేలను ముద్దాడిన మనసు
తనలోనూ మట్టి ఉందని
ఆలస్యంగా తెలుసుకుంది
పుడమి పంచన చేరిన మనసు
నింగి రాజ్యానికి
శిరస్సు వంచి క్షమాపణలు కోరుతోంది
మనస్వినీ

1 comment: