Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 16 January 2016

నల్లని వెన్నెల


నల్లని వెన్నెల

ఎక్కడో దూరాన
కొండల నడుమ
సాయం సూరీడు జారిపోతున్న వేళ
జగతిని మింగేసేందుకు
నిశి రక్కసి
బద్దకంగా ఒళ్ళు విరుచుకునే తరుణాన
మెల్ల మెల్లగా
దూసుకువస్తున్న
నల్లని దుప్పటి
ప్రకృతి అందాలను ఆరగిస్తూ
జగమంతా నలుపును అద్దుతూ
వెన్నెలను ఆరగించింది
వెన్నెల సంతకంతో
పులకించిన మనసు
నిశి జాడలకు
మౌనంగానే తల ఒగ్గింది
వెన్నెలవానలో
తడిసిన భావాలు
వికసించిన పుష్పంలా
విరిసిన అక్షరాలు
వర్ణం కోల్పోయి
అవర్ణమై
తిరోగమన బాటను ముద్దాడి
చీకటిలో లీనమైపోయాయి
జీవితం నిత్యం
చీకటి వెలుగుల సంగమం
దోబూచులాడే కాంతి రేఖలను
మాయం చేసే శక్తి
అవనిలో ఉన్నది
నల్లని చీకటికే
నల్లని వెన్నెలే
శాశ్వతం నిత్యం
మనస్వినీ

1 comment: