Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 5 January 2016

నేను నీకై

నేను నీకై


కనురెప్పల పరదాలను
తివాచీలుగా పరుచుకున్నా
గుండె కవాటాలను తీసి
నీ పాదాలకు పుష్పాలుగా
అర్పించుకున్నా
నా శ్వాసలో ఊపిరిని
నీకే అంకితం ఇచ్చుకున్నా
నాలో చెలరేగే భావాల
అక్షర మాలికలను
నీ కంఠ హారాలుగా చూసుకున్నా
నా ప్రతి ఆలోచనను
నా ప్రతి అడుగును
నీకోసమే మలుచుకున్నా
నేను నేనుగా
నన్ను నీకే
ఇచ్చుకున్నా
నాలో భావాలు
నా అంతరంగాలు
నా ఆశలు
ఆకాంక్షలు
అన్నీ నాలో నాలాగే ఉన్నాయి
నన్ను నన్నుగా
చూసుకుంటావనే ఆశతో
అంతంలేని అనురాగంతో
నన్ను నేను
నీకు కానుకగా ఇచ్చుకున్నా
నా కానుకను
గుండెకు హత్తుకున్నావనే
నమ్మకంతోనే
ఇంకా జీవిస్తున్నా
మనస్వినీ

No comments:

Post a Comment