Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 9 January 2016

మనసుంటే...

మనసుంటే... 

చల్లగా వీచే పిల్లగాలిలో
లిపి లేని అక్షరాలు వెతుక్కుంటా
మనసును తాకిన ముద్దబంతిలో
భాషే లేని భావాలను చూసుకుంటా
చల్లగా తాకే పవనంతో
దోబూచులాడే కురులతో
కవితలే అల్లుకుంటా
నుదిటిమీద బింబంలో
చందమామనే ముద్దాడుకుంటా
పడతి సొగసులో
జగతి వెతలలో
జీవాన్నే నిలుపుకుంటా
మనసుతో చూస్తే తెలిసెను భావం
అభిమానిస్తేనే కలుగును అనురాగం
నా భావం జీవచైతన్యం
కల్పనలు కావు నా రాతలు
అభూత కల్పనలు కావు నా కవితలు
మనసుపెట్టి చూస్తే విరిసేపరిమళాలు
అవి వెదజల్లేను సౌరభాలు
అబద్దాల పునాదుల్లో మేడలు కట్టి
కుట్రలు కుతంత్రాలనే ఆహారంగా తీసుకుని
కొంపలు ముంచే పనులే పరమావధిగా బతికే
మనసే లేని మనుషులకు
నా రాతలు పిచ్చిరాతలే
మనస్వినీ

No comments:

Post a Comment