Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 8 January 2016

మీకు మనసుందా...

మీకు మనసుందా... 

హృదయం ఉంటుంది అందరికీ
మనసు ఉండేది ఎందరికి
కళ్ళనే నమ్మేది అందరు
మనసుతో చూసేది ఎందరు
జరిగేది చెప్పుకునేది అందరు
అంతరంగం చూసేది ఎందరు
ఆస్తులు అంతస్తులను కొలిచేది అందరు
మనసు విలువను చూసేది ఎందరు
ఉన్నాడో లేడో తెలియని దేవుడిని కొలిచేది అందరు
మనిషిలోనే దేవుడిని చూసేది కొందరు
మహా భక్తులమని నమ్మిస్తూ
దేవుడి సూత్రాలను తిరగ రాసేది కొందరు
పెద్దల ధాష్టీకాలకు బలయ్యేది ఎందరో
కులం మతం పేరుతో విభజన చేసేది కొందరు
అంతరాలే లేవంటూ తిరగబడేది కొందరు
మనిషిని మనీతో కాదు
మనసుతో చూడగలిగే వాడే గొప్పవాడు
ఆస్తులతో అంతస్తులు లెక్కించక
నడవడిని తెలుసుకున్న వాడే ధన్యుడు
అంతంలో ఈ అంతరాలన్నీ
ఏమైపోతాయి
మనస్వినీ

No comments:

Post a Comment