Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 1 March 2016

వయసు తరిగింది

 వయసు తరిగింది
 
తరుగుతోందా
పెరుగుతోందా
పెరుగుతున్న ప్రాయంతో
పరువం పోటీ పడుతోందా
కన్నులలో వెన్నల దొంతరలు
మరింత కాంతివంతమవుతున్నాయా
పెదాల మధురిమలు
ఇంకా తేనీయలు పులుముకుంటున్నాయా
నీలి మేఘమాలికలు కురులు
మరిన్ని నిశి దుప్పట్లు పరుస్తున్నాయా
కురుల మేఘాల నీడన ఆ మోము
చంద్రబింబంలా మరిన్ని వెలుగులు సంతరించుకుందా
మఖ్మల్ మెత్తదనాల కరములు
గుండె సవ్వడులను కదిలించే
అందియల చప్పుళ్ళు
రోజు రోజుకూ కొత్తగానే కనిపిస్తున్నాయి
కాలం గడుస్తున్నా
గడియారం ముళ్ళు పరుగులు తీస్తున్నా
ప్రకృతి అలసి సొలసిపోతున్నా
నీలో మాత్రం రోజూ కొత్తదనమే
ఇంతకీ
నీ ప్రాయం పెరుగుతోందా
తరుగుతోందా
మనస్వినీ

No comments:

Post a Comment