Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 21 March 2016

సవ్వడి చేయని మాటలు

సవ్వడి చేయని మాటలు

ఎంత బావుంది ఈ మౌనం
ఎంత అందంగా వుంది శూన్యం
ఎంత అచేతనంగా మారింది మానసం
అలజడులు
అల్లకల్లోలాలు
సద్దుమణిగిన వైనం
మనసు మరో రూపంలో వచ్చి
మనసుతోనే ముచ్చటించే దృశ్యం
ఎవరికీ వినిపించని వాక్యం
అభ్యంతరాలే కానరాని భాష్యం
ఎంత బావుంది మౌనం
వెలుగుల జిలుగులు లేవు
గాయం రేపే మంటలు లేవు
నచ్చిన బొమ్మలు లేవు
నచ్చని నాట్యాలూ లేవు
ఎవరి కథలు లేవు
ఎవరి స్క్రీన్ ప్లే లేదు
అంతా మనసుకు నచ్చిన చిత్రాలే
అన్నీ ఇష్టమైన బొమ్మలే
నిశి చీకటి తెరలపై
మనసు భావాలే కదలాడే చిత్రాలు
అవును
ఎంత అందంగా వుంది శూన్యం
అచేతనంగా మారిన నా మానసం
మౌనంలోనే మాటలు శోధిస్తోంది
చీకటిలోనే వెలుగులను చూస్తోంది
వెలుగులు చేరని మార్గాలు
సవ్వడి చేయని మాటలు
ఇవే నా నేస్తాలు
మనస్వినీ

No comments:

Post a Comment