Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 17 March 2016

కాలమా ఆగిపో

కాలమా ఆగిపో
 
మనసు లేదు నీకు
కరుణ తెలియదు నీకు
కన్నీటి విలువ తెలియదు నీకు
చిరునవ్వుల వెనుక విషాదం చూడవు నీవు
నీకు తెలిసింది ఒక్కటే
ఆడుకోవటం
చదరంగంలో పావులు కదపటం
నీ ఉనికిని చాటే గడియారం ముల్లు చూడు
ఎంత ప్రశాంతంగా నడుస్తున్నదో
మరి నీకేమయ్యింది
ఎందుకీ దోబూచులాటలు
ఓడలను బళ్ళుగా
బళ్లను ఓడలుగా మార్చేస్తావు
ఉన్నత శిఖరాలను నేల కూలుస్తావ్
కుక్కలను సింహాసనాలపై కూర్చోపెడ్తావ్
శిఖరాల శిథిలాల కింద నలిగిన మనసులు చూడు
రాజ్యమేలుతున్న కుక్కల లీలలు చూడు
మనసున్న మనుషులను వేధించి
మనీ మనసులకు అందలాలు కల్పించే నువ్వు
ఎందుకిలా ఆడుకుంటున్నావు
మనిషిని బొమ్మగా మార్చిన కాలమా
ఆగిపో

No comments:

Post a Comment