Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 20 March 2016

ఆ దేవుడి స్వర్గం నాకొద్దు

ఆ దేవుడి స్వర్గం నాకొద్దు

నీతి
నిజాయితీ
ధర్మం
పరోపకారం
పవిత్రత
శాంతం
కారుణ్యం
సహనం
సమానత్వం
ఇవి దైవానికి ఇష్టమైన అంశాలు
అన్నీ చేసిన మంచివాడికి
అంతిమంగా దొరికేది స్వర్గమే
అన్ని మతాలూ ప్రవచించే సూత్రాలే
మరి బతికి ఉన్న మంచోడికి
అడుగడుగునా అవమానాలే
మంచోడివి కాదు
చేతకాని వాడివి
ద్రోహివి
దగాకోరువి
బతకలేనివాడివి
మనసులేని వాడివి
దొరికేవి ఈ బిరుదాలే
మంచోడికి కన్నీళ్ళే ఆస్తులు
రాళ్ళూ రప్పలే రాజమార్గాలు
ప్రతి ఘడియా వేదనమే
ప్రతి మలుపూ నరకమే
కాలే కడుపూ
పేగుల కేకలు
ఎండిన పెదాలూ
ఇంకిన కన్నీళ్ళూ
ఇవే మంచోడి ఆభరణాలు
మరణించాక స్వాగతం పలికే స్వర్గం కోసం
బతికి ఉండీ చావటం ఎందుకు
ప్రశాంతత లేని జీవితం గడిపి
ఉన్నదో లేదో తెలియని స్వర్గం కోసం మరణించాలా
దైవ గ్రంథాల సారం ఇదే అయితే
ఆ దేవుడి స్వర్గం నాకొద్దు
మనస్వినీ

2 comments:


  1. ఓదేవుడా! వలదు యిక
    నీదే అనబడు దివి!మరి నీవే గొనుమా
    మాదను యీ భువి కలతలు
    లేదన గలవా ? ప్రభువును లేదనుకుందున్

    ReplyDelete
  2. అయ్యా మీకు ఓ చిన్న సలహా మరోలా భావించ కండి ఏదైనా నిజ్జంగా చేస్తే మనసుకి తృప్తి వస్తుంది అది నింపి నట్లు మరేదీ మన ఆకలిని చల్లార్చ దు ఇక్కడే సంతృప్తి అనే స్వర్గ సుఖం వస్తుంది ...బిదోడే మరో బీదోడికి ఓ రొట్టి ముక్క పెట్టడం నువ్వు ఎక్కడా చూడలేదా వాడి దగ్గర ఏమి ఉందని తోటి వాడికి పెడుతున్నాడు? ఎప్పుడు కొట్టు కునే వాళ్ళనే చూసి ఉండవచ్చు మంచోళ్ళు కుడా ఇక్కడే ఉన్నారు దేవుడిని స్వర్గాన్ని ఎందుకులే ఆడి పోసుకున్టావు మంచి చేయాలని ఉంటె వేరే వాడి గుర్తింపు కోసం ఎదురు చూడకూడదు ఎందుకంటే విమర్శించే వాడికి నీకు వచ్చినంత ఆలోచన కుడా లేదని తెలుసుకుంటే సరి
    ఎని వె నా శుభాసీ స్సులు ఇంకా ఇంకా కవితలు రాస్తూనే ఉండుమీ

    ReplyDelete