Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 30 November 2017

మనసు లేఖను నువ్వే రాసుకో

మనసు లేఖను నువ్వే రాసుకో

మెరిసే నక్షత్రాలను అక్షరాలుగా మార్చుకోనా
నవ్వే పువ్వులను నా భావాలుగా మలుచుకోనా
చందమామకు నా మనసు గోడును చెప్పుకోనా
వెండివెన్నెలలో కలిపి నా శ్వాసను తెలుపుకోనా
నీలి నింగి మబ్బులతో నా సందేశం పంపనా
చల్లని చిరుగాలికి నా మనసు విప్పి చూపనా
ప్రేమలేఖ రాయాలని ఉంది అక్షరాలను వెతికి పట్టనా
చెదిరిపోయి పరుగులుతీస్తున్న అక్షరాలకు తలవంచనా
మనసుమాట చెప్పాలని ఉంది మౌనానికి సవ్వడి నేర్పనా
ఏ భాషలో చెప్పాలో తెలియక తెలియని పాండిత్యం నేర్చుకోనా
హృదయ సవ్వడి చెప్పేందుకు మాటలు లేవు నాలో
ప్రేమలేఖ రాసేందుకు అక్షరాలే లేవు నాలో
నా మనసు పుస్తకం తెరిచిపెడుతున్నా
అక్షరాలను కూర్చి నా మనసు లేఖను నువ్వే రాసుకో

2 comments:

  1. మనసు తెలుసుకోవడానికి లేఖలతో పనిలేదుగా...అయినా నువ్వే రాసుకోమని నిర్మొహమాటంగా చెప్పేస్తే ఎలా :)

    ReplyDelete
  2. నేను రాయలేక అలా అడిగానన్నమాట అర్ధం చేసుకోరూ...

    ReplyDelete