Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 7 June 2015

నీలోనే నేను

నీలోనే నేను

నాలో నుంచి నేను మాయమై
నీలోనే నిండిపోవాలనీ
నువ్వే నేనై నేనే నువ్వై
మనముగానే మిగిలిపోవాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా
నీ కనుల కమలాల నుంచి జారిపడే
నీటి చుక్కలను దోసిటపట్టి
తడియారిన నా కనురెప్పలలో
నింపుకోవాలనీ
ఎంతగానో కోరుకున్నా
చిగురుటాకు పెదాల నుంచి జారిపడే
నోటి ముత్యాలలో వెన్నెల మెరుపును కావాలనీ
నీ తీయని పలుకుల అర్ధమే నేనై
పరమార్ధం నేనై
మిగిలిపోవాలనీ
ప్రతి క్షణం పరితపించా
నీ శ్వాసకు ఊపిరిపోసి
గుండె గుడిలో ప్రమిదకు ఇంధనం నేనవ్వాలనీ
మనసు నిండా ఆరాటపడ్డా
నా మనసు విలువ తెలియని నీ మనసులో
రగిలిన వేదనకు సమిధగా మిగిలిపోయా
నా గురించికాదు
నీ గురించి నువ్వు ఆలోచించు
నీ ప్రతి ఆలోచనలో
నేనే కనిపిస్తా

2 comments:

  1. ఒకరికొకరు మమైకమై

    ReplyDelete
    Replies
    1. ఏదో రాసుకుంటున్నా మీ భావాలే బావుంటాయి పద్మాజీ..

      Delete