Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 8 June 2015

నిప్పులాంటి నిజాలు

నిప్పులాంటి నిజాలు

నా అక్షరాలు ఎక్కడైనా కనిపిస్తాయి
ప్రతి దిక్కులో నా అక్షరాలే
శూన్యంలోనూ నా అక్షరాలే
అందు గలవు ఇందు లేవు అన్నట్లు
అన్నింటా నా అక్షరాలే
భార్యా భర్తల అనురాగంలో
రక్తి కట్టించేది నా అక్షరాలే
ప్రేయసీ ప్రియుల పదనిసల్లో
నాట్యమాడేది నా అక్షరాలే
అన్నదమ్ముల అనుబంధంలో
బంధువులాడే నాటకంలో
స్నేహితుల సహకారంలో
స్నేహమనే ముసుగులో
సత్య దర్పణాలు నా అక్షరాలే
మనసూ మనసుల రాపిడిలో
జనియించే నిప్పు కణికలు నా అక్షరాలే
సమాజంలో మోసాలను
నిలదీసే సాహస పుత్రికలు నా అక్షరాలే
కుట్రలు కుతంత్రాలకు
నిలువెత్తు సాక్ష్యాలే నా అక్షరాలు
ఎవరికీ సంబంధం లేనివి నా అక్షరాలు
అన్నింటినీ నిలదీస్తాయి నా అక్షరాలు
అనురాగంలో వికసిస్తాయి
అనుబంధంలో పరిమళిస్థాయి
ఘర్షణలో రగిలిపోతాయి
మోసాన్ని ప్రశ్నిస్తాయి
స్నేహానికి తలవంచుతాయి
నిప్పులాంటి నిజాలే నా అక్షరాలు
అల్లుకున్న అక్షరాలతో వికసించిన భావనలు
నా జీవితం కాదు
ప్రతి జీవితంలో
పరకాయ ప్రవేశం చేసే
చైతన్య దీపికలు నా అక్షరాలు
నా భావాలోకంలో నేనే ఉన్నా
అదే నా జీవితం కాదు
మనస్వినీ

No comments:

Post a Comment