Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 9 June 2015

జ్ఞాపకాల బాటలో


జ్ఞాపకాల బాటలో


విసిరేసిన జ్ఞాపకాలను
మరలా తీసుకుపో
అలజడి రేగితే జారిపోకుండా
గుండెకు పొదివి పట్టుకో
మనసుకు తగిలిన గాయాలకు
మమతల లేపనం పూసిపో
దీపం ఆరిన గుడిలో
మనసు దీపం వెలిగించి పో
తడియారిన పెదవులపై
చిరునవ్వుల రంగు అద్ది పో
బీడు వారిన మనోసీమపై
పన్నీటి వానై కురిసి పో
నీ కనుల వెన్నెల కురిస్తే చాలు
నా జ్ఞాపకాలు మరలా వికసిస్తాయి
విరిసిన జ్ఞాపకాలను
మనసు నిండా నింపుకో
నీతో నడుస్తున్న జ్ఞాపకాల
బాటలో నేనూ నడిచిరానా
మనస్వినీ

No comments:

Post a Comment