Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 2 June 2015

నిశిజీవిని

నిశిజీవిని

పూరెమ్మల ఒడిలో నుంచి రాలిపడే రేణువుల్లా
నా కన్నుల్లో కలలన్నీ రాలిపోయాయి
ఉప్పెనలా వచ్చిన అల ఒకటి
కలల ఆనవాళ్ళను తుడిచేసింది

ఎగసిపడిన కెరటాలకు
జీవన సౌధం కొట్టుకుపోయింది
అలల ధాటికి అది శిథిల నగరమై నిలిచింది

శిలాజాల నగరిలో
మరమనుషుల బాటలో
ఎడారిలా మిగిలిన పూలవనంలో
వాడిపడిన పూలను చూస్తూ
కరిగిన స్వప్నం ఆనవాళ్ళను వెతుక్కుంటూ
నిశి జీవినై నిలిచి ఉన్నా

తెలవారేనని కన్నులు విప్పితే
వెక్కిరించిన సంధ్యను చూసి నవ్వుకున్నా
ఉదయంలోనూ సాయం సంధ్యలోనూ
నేను లేనే లేనని తెలుసుకున్నా
ఘడియ ఘడియకు మధ్యలో
ఉనికే లేని నేను నేనేకాదని సరిపెట్టుకున్నా

పుడమిలో దిగబడిన అడుగుజాడల్లో
సమాధి అయిన గతాన్ని అన్వేషిస్తూ
నా కనులకు కలల యోగమే లేదని
చెమర్చిన కనురెప్పలను
ఓదార్చుకున్నా

No comments:

Post a Comment