Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 15 November 2014

అనుబంధం...

అనుబంధం...
ఎదో చల్లగా చల్ల చల్లగా...
చల్లదనమో ....వెచ్చదనమో...
ఎదో తెలియని అనుభూతి...
అది స్పర్శేనా .....ఏమిటది...
ఎదో తెలియని  అనుభవం...
కనుకొనలు ఒకింత పైకెత్తి చూస్తే...
కొంటె చూపులు  కవ్విస్తూ నవ్విస్తూ...
అవును ప్రియసఖుడు ఆర్తిగా కొంటెగా ...
తనవైపే చూస్తున్నాడు..
ఆ చూపుల నుండి కురుస్తున్న  వెన్నెల...
ప్రియ సఖి కలువ బాల తనువును..   
ఆర్తిగా తడుముతోంది..
పగలంతా  ముడుచుకున్న ...
ఆ కలువ పూబాల ఆణువణువూ....
గిలిగింతలతో ...పులకింతలతో...
విచ్చుకుంది..ఒళ్లంతా విరబూసుకుంది...
అది నెలవంక  కలువ బాల తన్మయత్వమా...
అదో అందమైన అనుభవమా...
కాదు కాదు అది అనుభవమే కాదు...
మధురమైన అనుబంధం కూడా...
ఆ అనుభవంతో కూడిన .....
తీయని అనుబంధం మనది కాదా...
మనస్వినీ.....

No comments:

Post a Comment