Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 19 November 2014

స్వప్నిక

స్వప్నిక
ఇంద్ర ధనుస్సు రంగులన్నీ....
కలబోసి ఒక్క చోటే కుప్పపోసినట్టుగా....
ప్రకృతి కుంచె నుంచి జారిపడిన...
రంగుల వల్లిలా...
కనీ వినీ ఎరుగని....ఎన్నడూ చూడని ....
రంగులన్నీ ముద్దబోసినట్టుగా...
అంతా అయోమయం....
ఏవేవో రంగులు....
ఒకదానిపై ఒకటి చేరుతూ...
ఒక ఆకృతి నుంచి...
మరో ఆకృతిలోకి రూపాంతరం చెందుతూ...
లీలగా ఉండీ లేనట్టుగా...
నిజమా కాదా అనిపించేలా...
మసక మసకగా...
నా కంటి తెరలపై...
స్వప్నికలను తట్టిలేపుతూ....
చిరునవ్వులు చిందించే...
ఆ దివ్య సుందర రూపం...
నీవు కాక ఇంకెవ్వరు...
మనస్వినీ...


No comments:

Post a Comment