Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 6 November 2014

జాబిలమ్మ

జాబిలమ్మ
చల్లని వెన్నెల....
కురిపించే జాబిలమ్మను....
మబ్బులు కమ్ముకుంటే....
చల్లదనం మాయమవుతుందా......
మబ్బుల పరదాలు శశి కిరణాలను......
ఆపగలవా.....
చంద్రోదయం .....               
ఆగదు..ఆగబోదు...     
ఎందుకలా ఆలోచిస్తావ్.....
ఏమాలోచిస్తున్నావ్...
ఏమయ్యింది నీకు...
మల్లెల పరిమళాలు....
మారిపోతాయా...
గులాబీలో
వన్నెలు చిన్నెలు....
రాజసాన్ని కోల్పోతాయా..
మరి నీలో ఏం లేదని ...
ఎందుకు అనుకుంటావ్...?
మబ్బులు వస్తాయ్.....
తరలిపోతాయ్....
భావనలు మారవు....
అనురాగాలు మారవు...
మళ్ళీ అనకు ...
నాలో కొత్తగా ఏముందనీ...
నువ్వు ...
నిత్య నూతన పరిమళమే..
మనస్వినీ...


No comments:

Post a Comment