Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 21 November 2014

మౌనాక్షరాలు..



మౌనాక్షరాలు..
భావరహితమైన కన్నులు....
మెరుపులు కోల్పోయిన పెదాలు....
ఎదో గుంభనం....
ఎదలో మాత్రం ఎదో కదలిక...
మనసుపొరల్లో ఎదో అలజడి...
అంతరాన దాగిన కల్లోలం...
బయటికి రానీయని వైనం..                      
కను రెప్పలు  వాల్చి ....
పెదాలను అలవోకగా మూసేసి..
మదిలో రొదలను...
ఎదలోని  సొదలను...
ఉబికిరానీయకుండా...
ఎంత ఆరాట పడినా...
నీ భావం నాకు తెలియనిదా...
నీ అంతరాలను నేను పసిగట్టలేనా...
నీ మౌనం నుంచి అక్షరాలను...
నేను ఎరుకుంటున్నా...
మనస్వినీ...

No comments:

Post a Comment