Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 27 November 2014

మనసా.. ఎందుకే ఇలా...



మనసా..  ఎందుకే ఇలా...
మనసా ఎందుకిలా చేశావు...
ఆకాశంలో ఉన్న నన్ను....
నేలపై ఎందుకు దించావు...
అమృత క్షణాలు...
పలకరించినా...
కన్నీటి సుడులు చుట్టుముట్టినా...
అయినవారు కాని వారయినా...
సలాం చేసిన వాళ్ళు...
ముఖం చాటేసినా..
తప్పు నాదేనా...
నా వల్లే అంతా జరిగిందా...
ఎందుకు ఇలా జరిగింది...
నిజంగా తప్పు నాదేనా...
నా ఆలోచనలు తప్పుదారి పట్టాయా...
నాలో కపటం దాగి ఉందా...
నిజాలు నేను మాట్లాడలేనా...
నా ఊహలు...నా అంతరంగం...
నా ఆలోచనలు...
దేనికీ పునాది లేదా...
నాలో ఎందుకీ అంతర్మధనం...
అందరున్నా...
నేను ఒంటరినే ఎందుకు...
నువ్వు చెప్పిందే చేశాను...
నీ ఆలోచనలే అమలు చేశాను...
అయినా ఇప్పుడు....
ఓటమి అంచున నిలిచాను ఎందుకు...
నీవల్లే కాదా...
నాలో నువ్వే లేకపోతే...
ఇలా ఉండేదా...
అవును మనస్సు మాటే విన్నా...
అందుకే .............
పువ్వులకు బదులు...
రాళ్ళు ఏరుకుంటున్నా...
మనస్వినీ...

No comments:

Post a Comment