Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 21 November 2014

నాకు బతకాలని ఉంది...

నాకు బతకాలని ఉంది...

ఆ క్షణం లో ...
నా మదిలో లక్ష ప్రశ్నలు...
ఏవేవో ఆలోచనలు...
ఏం జరుగుతోందో తెలియదు...
ఏమవబోతోందో తెలియదు...
కానీ ఖచ్చితంగా ఎదో జరగబోతోంది...
అసలేం జరిగిందంటే...
ప్రతి ఉదయం లాగే...
ఆ ఉదయం కూడా...
నేను ఆఫీసుకు బయలుదేరాను...
రోజు వెళ్ళే మార్గమే..
నా కారు అలలా దుసుకుపోతోంది...
పివి ఎక్స్ ప్రెస్ హైవే...
శివరాంపల్లి దాటాను...
కార్ స్టీరియోలో ఇష్టమైన పాట మంద్రంగా ....
అలా అలా సాగుతోంది..
క్రమంగా ఎదో మార్పు...
తలలో ఎదో భారం...
అలా మరికొంత దూరం...
మెల్లగా మనసులో ఎదో అలజడి...
మదిలో ఎదో సునామి...
కళ్ళలో సుడులు తిరుగుతున్న నీళ్ళు...
గుండె పై వెయ్యి టన్నుల బరువు మోపిన భావన...
ఎవరో గుండెలో చెయ్యి పెట్టి కెలుకుతున్న వేదన...
పిల్లర్ నంబర్ 176... దగ్గర...కార్ ఆగిపోయింది...
కొన్ని క్షణాలు...
గుండెను నులిమేస్తున్న బాధ...
ధారగా కురుస్తున్న కన్నీళ్లు...
ఎవరికి చెప్పాలో తెలియని అయోమయం...
పక్కనే పది అడుగులు వేస్తే నా గారాలపట్టి కాలేజి...
నా తల్లి అక్కడే ఉంది...
కానీ చేరుకోలేను...
ఆసమయంలో అందరూ నాకళ్ళ ముందు మెదిలారు...
నేను చచ్చిపోతున్నానా...
నేను పోతే...ఇక్కడే ఉన్న నా చిట్టి తల్లికి తెలుస్తుందా...
చేయి ఊపి వీడ్కోలు పలికిన నీకు ఎవరు చెబుతారు...
నా యువరాజు తట్టుకోగలడా...
నా కుటుంబానికి దిక్కేది...
అసలు నన్ను ఇంటికి చేరుస్తారా ఎవరైనా...
నా శరీరాన్ని కోసి ముక్కలు చేస్తారా...
ఎనెన్నో ప్రశ్నలు...
మరెన్నో సందేహాలు....
అదెంటో .....
ముప్పిరిగొన్న ప్రశ్నలు ఒకవైపు అల్లకల్లోలం రేపుతుంటే...
మనసు పొరల్లో సునామీ శాంతించింది...
తేరుకున్నా... మళ్ళీ ముందుకే సాగా...
కానీ ఆ క్షణంలో ఏమయ్యింది నాకు...
నేను మృత్యు ఒడికి వెళ్లి వచ్చానా...
నిజమేనా...
నాకు బతకాలని ఉంది ....
మనస్వినీ...


No comments:

Post a Comment