Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 29 November 2014

కథానాయిక...



కథానాయిక...

మసకేసిన మబ్బులు.....
జాబిలమ్మతో దోబుచులాడుతున్నవేళ..
పోరాటం ఆరాటాల మధ్య...
కురిసీ కురియని వెన్నెల రాతిరిలో....
ఉండీ లేనట్టుగా ఉన్న నిశీధిని...
చీల్చుకుంటూ...
ఓ తారక నేల రాలుతున్న వేళ.....
సంభ్రమంగా నేను ....
ఆకాశం వైపు చూడగా....
ఓ కాంతి పుంజం....
అలలా సాగుతూ....
పుడమి వైపు జారింది...
అంతలోనే తెల్లని పాల మీగడలా మరో మేఘం...
లయబద్దంగా...దూసుకువచ్చింది...
కొద్ది సేపు ఏం జరిగిందో...
కళ్ళు నులుముకుని చూస్తే...
ఆకాశానికి మార్గం వేసినట్లు...
దూది పింజాల్లా తేలుతున్న మెట్లు ....
ఆశ్చర్యం...
ఆ మెట్లపై  మరో కాంతి పుంజం...
ఆ మేఘం మెల్ల మెల్లగా...
ఒక ఆకృతిలా....
అందమైన దేవకన్యలా...
తేలియాడుతూ...
నా వైపు దూసుకువస్తోంది...
ఆమె నా దరికి చేరి....
సుతారంగా నా చెయ్యి అందుకుంది...
ఆ స్పర్శ తేనె పూసిన మఖ్ మల్  వస్త్రంలా...
గులాబీలోని సుకుమారత్వం లా ...
నన్ను  మైమరిపించింది...
ఆమె నాచేయి అందుకుని ముందుకు సాగుతోంది...
నేనూ మేఘంలా తేలిపోతూ ఆమె వెంట సాగిపోతున్నా...
అది ఏ లోకమో తెలియదు...
కళ్ళు తెరిస్తే....అంతా మాయం...
అనేక రాత్రులను నిద్ర లేని రాత్రులుగా మార్చిన....
ఆ స్వప్నంలో కథానాయిక ఎవరు...?
అది నువ్వే కాదా...
నువ్వు అవునన్నా... కాదని మారాం చేసినా...
ఆ స్వప్నిక నువ్వు కాక ....
ఇంకెవరు....
మనస్వినీ...

No comments:

Post a Comment