Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 3 November 2014

నా గులాబివి నువ్వే...


నా గులాబివి నువ్వే...
నాలో ఆనందం....
పురివిప్పి నాట్యమాడే వేళ
మనస్సు ఎదో తెలికతనంతో...
గాలిలో  తేలుతున్న వేళ....
నేలరాలుతున్న....
ఆనందభాష్పాల్లో..
ఇంద్ర ధనుస్సు...
రంగుల్లా ...
మెరుపులు చిందించేది....
నీ దివ్య సుందర రూపమే...
గుండెను మెలిపెట్టే బాధల్లో...
మనసుభారమై...
గుండె కవాటాలను
చీలుస్తూ..
కన్నీటి సంద్రం ...
ఉప్పొంగిన వేళ...
కన్నీటి సుడులలో...
జాలువారేది ....
నీ రూపమే...
అవును నేనింతే...
అన్ని వేళలా...
నిన్నంతే ప్రేమిస్తా...
నీ మాటల సునామీ...
మానస సంద్రంలో..
అల్లకల్లోలం రేపుతున్నా..
నా భావం మారదు..
నా ప్రేమ తరగదు...
ముళ్ళున్నాయని....
గులాబీని అందుకునే ...
ఆలోచనను విరమించుకుంటానా...
అలాగయితే...
పుష్పరాజం మకరందాన్ని..
కోల్పోనా...
అవును ....
నా మనసు....
మారదు...
నువ్వెప్పుడూ....
నాకు మకరందానివే...
మనస్వినీ....

No comments:

Post a Comment