Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 15 November 2014

అమ్మవు నీవు...



అమ్మవు నీవు...
మనసులో ఏదో అలజడి...
ఏం జరుగుతోందో....
తెలియని ఆందోళన.....
గుండె లోతులలో తన్నుకు వస్తున్న ఆవేదన...
మానస సంద్రంలో అల్లకల్లోలం....
చెమర్చిన కన్నులలో...
ఉబికి వస్తున్న జలధారలు...
ఎటు చూసినా చీకటి తెరలే...
అంతా శూన్యమనే  ఆలోచన...
ధారలుగా కురుస్తున్న ...
కన్నీటిని ఆపేవారే లేరన్న బాధ...
గుండెను నులిమేస్తున్న వేళ.....
నేనున్నానంటూ వచ్చి ...
నన్ను గుండెలకు అదుముకుని...
నేనున్నా కన్నా అంటూ...
లాలించి ఓదార్చి అనునయించిన ...
నిన్ను చూసి నాలోని వేదన ....
నీటి బుడగల్లా  తేలిపోదా...
నన్ను లాలించిన  నీ అనురాగం...
నాకు జీవితం పై ఆశలు రేపదా....
ఆ క్షణంలో నీవు తల్లిలా భుజం తట్టితే...
నేను నీ పసిబిడ్డను కానా ..
మనస్వినీ...

No comments:

Post a Comment