Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 17 November 2014

నవ్వుల పువ్వులు..



నవ్వుల పువ్వులు..
నీ పెదాల మాటున దాగి దాగి......
రావాలా వద్దా అని దోబూచులాడుతూ...
చివరకు బెట్టును వీడి ....
మధురసాలను చిందిస్తూ....
ముత్యాలను మరిపిస్తూ ....
జాలువారిన నీ చిరునవ్వుల పువ్వులు...
నా గుండె పుస్తకం పై...
చెరగని సంతకం చేసిపోతే....      
నా గుండె లోతుల్లో ...
వేదనలు....రోదనలు...
మాయమై పోతుంటే...
నా జీవనంలో చీకటి తెరలు ....
ఒక్కొక్కటిగా...
తొలగిపోతుంటే...
నీ కన్నులలో మెరుపులు..
నవ్వులలో పువ్వులు...
నాలో నవ వసంతాన్ని  చిగురించవా...
అందుకే...
నిత్యం అను నిత్యం...
చిరునవ్వులు ....
చిందించవా...
మనస్వినీ....

No comments:

Post a Comment