Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 30 May 2015

మట్టి మనసు

మట్టి మనసు

కళ్ళ ముందు చికెన్ బిర్యానీ
పప్పన్నం ఎలా రుచిస్తుంది
ఫారిన్ విస్కీ లాగించే మనిషికి
నాటుసారా ఎలా నచ్చుతుంది
సిరి సంపదల మనసుకు
ఖాళీ పర్సు ఎలా కనిపిస్తుంది
హంసతూలికా తల్పం అలవడిన దేహానికి
చిరిగిన చాప సుఖమేమిస్తుంది
బెంజికార్ల బాటసారికి
కాలి నడక ఎందుకు కనిపిస్తుంది
పచ్చనోటు ఆరగించే వాడికి
చిల్లర నాణం ఎలా అరుగుతుంది
ఊహల రెక్కలు విచ్చిన మనసుకు
మట్టివాసన ఎలా నచ్చుతుంది
పరులంతా అబద్దమని భ్రమించే మనసుకి
నిజమెలాగుంటుందో ఎలా తెలుస్తుంది
మనసా ఇదే లోకం పోకడ
ఇలాగే ఉంటుంది ఇక్కడ
నీ స్థాయి తెలుసుకుని మసులుకో
మట్టిలో పుట్టిన నీవు
మట్టిమనిశిగానే ఆలోచించు
ఆకాశంలో విహరించినా
చివరకు ముద్దాదాల్సింది మట్టినే
మనసా
మట్టి మనిషిగానే మిగిలిపో

1 comment:

  1. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసిపోతాము.
    ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము. తెగిన గాలిపటము.
    పగిలిన ఆవకాయ జాడ్యము. విరిగిన తెల్లని బలపము.

    ReplyDelete