Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 5 May 2015

బాట మరిచిన బాటసారిని

బాట మరిచిన బాటసారిని

పున్నమి జాబిలిలా మెరిసిన నేను
రాలిపడిన తారకనయ్యాను ...
శిఖరంలా ఎదిగిన నేను
నేలకొరిగిన శిథిలంలా మిగిలాను...
ఉరుములు మెరుపులతో వర్షించే మేఘం నేను
కనురెప్పల మాటున దాగిన నీటి చుక్కను అయ్యాను...
ప్రేమనగరం నిర్మించాలనుకున్నాను
శిథిలనగరంలో బాటసారినయ్యాను...
ఆశయాల పునాదులు తీసి
సిద్ధాంతాల మేడలు కట్టాను...
చిరుగాలికే కొట్టుకుపోయే
పేకమేడలని తెలుసుకోలేక పోయాను...
విరిసిన పూదోటను నేను
ముళ్ళబాటను దాటలేకపోయాను...
నలుగురికి బాసటగా నిలిచిన నేను
నేడు బాటనే మరిచిన బాటసారినయ్యాను...
ఇది నా స్వయంకృతాపరాధమే
మనస్వినీ...

2 comments:

  1. అందమైన భావాలతో కూడిన మీరు ఏమైనా పర్వాలేదు లెండి :-) బ్యూటిఫుల్ కవి

    ReplyDelete
    Replies
    1. విరిసిన పద్మాక్షరాల ముందు నా చిరుగులబీలు ఏ పాటివీ?... అందమైన మీ స్పందనకు ధన్యవాదములు పద్మాజీ....

      Delete