Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 25 November 2014

నీకు పొగరే అందం...


నీకు  పొగరే అందం... 
















మీనాలను మరిపించే
నీ కన్నులలో ....
మెరుపులే విరజిమ్మినా....
అవి చల్లదనాలను...
పంచి ఇవ్వవు...
అగ్ని గోళాలను తలపిస్తాయి...
అమృత దారాలు....
కురిపించే పెదాలలో...
ముత్యాలు ఏరుకోవాలని ...
అనుకుంటే...
మాటల తుటాలే...
గుండెను తాకుతాయి...
మయూర నడకలే నీవైనా...
నిర్లక్ష్యమే కనిపిస్తుంది...
నీ నడకలో....
అహంకారం...
నీ నడకలో కానరాని ....
లాలిత్యం...
ఎందరో నిన్ను చూసినా...
నీ వగరు పోగరు ధాటికి...
పరుగులే తీసారు...
అది వారి దురదృష్టం....
నీ అహంకారంలోనే...
అందం కనిపించింది నాకు...
నీ పోగరులోనే...
వలపు కురిసింది నాకు...
నీ నడకలోనే...
మయురాలు కనిపించాయి నాకు...
నీ పెదాల మాటలు....
అమృతాలు  కురిపించాయి నాకు...
మరి నేను అదృష్టవంతుడినేగా...
మనస్వినీ...

2 comments:

  1. avunu, aa adrustam okarike sontam mari :)

    ReplyDelete
    Replies
    1. అదృష్టమే ...ధన్యవాదాలు...

      Delete