Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 8 February 2016

అక్షరకాగడా

అక్షరకాగడా

అక్షరం దిశ మారుతోంది
భావం రంగు మారుతోంది
మనసు మసక బారుతోంది
మనసు చుట్టూ తిరిగే అక్షరం
సిగ్గుతో కుచించుకుపోతోంది
మనసులోని వేదనలు
గుండె గుడి బాధలు
అక్షరాలుగా పేర్చితే
తట్టుకోలేని రాతి మనుషులు
అపహాస్యాలు చేస్తుంటే
ఏదో ఆశించి
కథలు అల్లుతున్నట్లు
ప్రేలాపనలు చేస్తుంటే
కుంగిపోయిన అక్షరం
బయటికి రానంటున్నది
అందుకే నా భావం
మనసు బాటను వీడుతోంది
మెత్తని గులాబీలను తలపించిన అక్షరం
ఇక నిప్పు కణికగా రగలనుంది
ఇక నా భావంలో
ప్రేమ పరిమళించదు
ఇక నా కవిత్వంలో
పువ్వులు వికసించవు
నిన్నూ నిన్నూ
ఇదిగో నిన్ను కూడా
అందరినీ
సమాజం మొత్తాన్ని
కడిగిపారేస్తుంది
నా అక్షరం
ఇక ప్రతి నిత్యం
జ్వలించే కాగడా
నా అక్షరం

No comments:

Post a Comment