Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 14 February 2016

చెరగని సంతకం నీవు

చెరగని సంతకం నీవు

నా మనసును తాకిన తొలి శీతలపవనం నీవు
నా కనులకు కలలు నేర్పిన తొలి మధుర స్వప్నం నీవు
పువ్వులు ఎన్నో విరబూసినా
వసంతాలు ఎన్ని వచ్చి వెళ్ళినా
చిరునవ్వులు ఎన్ని చిందించినా
తారకలు ఎన్ని మురిపించినా
మనసు కాగితంపై చెరగని సంతకం నీవు
చెదరని చిరునవ్వులో ఎడారిలో కురిసే వానచినుకువి నీవు
చల్లని చూపులో నిశి చీకటిని కడిగివేసే వెన్నెలవు నీవు
చిద్విలాస నడకలో కదిలే కావ్యనాయికవే నీవు
నువ్వంటే నాకు ఇష్టం
నీ ప్రతిదీ నాకు ఇష్టం
నీ నవ్వు
నీకోపం
అన్నీ నాకిష్టమే
నీలో నాకు నచ్చిన దానినీ ప్రేమిస్తా
నచ్చని అంశాన్నీ ప్రేమిస్తా
ఎందుకో నువ్వంటే నాకంత ఇష్టం
నా ప్రేమను పొందావు
నా కోపాన్నీ భరించావు
స్వర్గ నాయికవే అయిన నీవు
నాతో నరకాన్నీ చవి చూశావు
నీలోనే నీవు
నీతోనే నీవు
అన్నీ నీలోనే దాచుకుని
చిరునవ్వులే నజరానాగా ఇచ్చావు
సతివై
ప్రియ సఖివై
నా అడుగులకు జాడగా నిలుస్తున్న నీకు
ఏమివ్వగలను జన్మదిన కానుకగా
నీకివ్వగల సిరిసంపదలు నాకు లేవు
అవేవీ కోరనూ లేదు నీవు
మనసులో మనసై
మనస్వినిగా
తోడూ నీడగా
నా బాటన నడుస్తున్న నీకు
మనసు నిండా ప్రణమిల్లుతూ
అందిస్తున్నా
జన్మదిన శుభాకాంక్షలు

{ఫిబ్రవరి 15 న నా సతీమణి జన్మదినం సందర్భంగా }

No comments:

Post a Comment