Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 13 February 2016

మిస్టర్ ఇండియా

మిస్టర్ ఇండియా

ఎవరి మనసులో ఏముందో
ఎవరు ఏమి కోరుకుంటున్నారో
ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో
ఎవరు ఎలాంటి పాచికలు విసురుతున్నారో
ఎవరు అభిమానులో
ఎవరు దురభిమానులో
ఎవరి మాటలో ఏ మర్మం దాగి వుందో
ఎవరి సహాయంలో ఏ స్వార్ధం పొంచి ఉందో
ఎవరు ఆప్తులో
ఎవరు శత్రువులో
ఎవరు పైకి లేపుతున్నారో
ఎవరు కిందకు పడేస్తున్నారో
ఎవరు ఎందుకు చేస్తున్నారో
ఎవరు ఎందుకు నవ్వుతున్నారో
ఎవరి మనసు తెలియకున్నది
ఎవరి గుట్టు వీడకున్నది
ఎవరు నేను
ఎందుకు నేను
ఒక్కసారి నేను మాయమైతే
మాయామై అందరి మనసులు చూడగలిగితే
మిస్టర్ ఇండియాలా
అందరి మనసు తెలుసుకోలేనా

No comments:

Post a Comment