Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 8 February 2016

ధనమే దైవము

ధనమే దైవము
 
ధనమా నువ్వే దైవమా
దైవమా ధనంతోనే నీ స్నేహమా
ధనమే దైవమయ్యే
దైవమే మాయమయ్యే
దైవం సృష్టించిన లోకం
ధనానికే దాసోహమయ్యే
కానుకలు ఇచ్చుకున్నా
కరగని బండరాయే దైవమయ్యే
ధనమున్నచోటే దైవం కొలువుతీరే
మహిమలన్నీ మాయమై
ధనంలోనే కలిసిపోయే
మనిషి మట్టి ముద్దయ్యే
ధనవంతుడే దేవుడయ్యే
దేవుడి లీలలు పురాణాల్లోనే మిగిలిపోయే
ధనమున్న వాడి కుట్రలు జీవితాలను శాసించే
బలహీనుడు కొలిచే దేవుడు
పనికిరాని పదార్థమయ్యే
దేవుడా మేలుకో
ధనలక్ష్మిని అడ్డుకో
దొంగల పంచన చేరిన లక్ష్మి
నీ ఉనికినే నాశనం చేస్తుంది.
ఇదే జరిగితే
సామాన్యుడు నిన్ను కాదు
ధనమునే పూజించక తప్పదు
నీ దైవత్వం
పురాణాలకే పరిమితం కాకపోదు

No comments:

Post a Comment