Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 14 July 2016

చిన్నగీత పెద్దగీత

చిన్నగీత పెద్దగీత 

సమస్యగా మారిన గీత సరసన
పెద్దగీతను చేర్చితే
ఆ గీత చిన్న గీత అవునేగానీ
సమస్య మారునా
పెద్దగీత జడిపించినా
చిన్నగీత ఆమోదమగునా
సమస్యకు మరో సమస్యే పరిష్కారమైతే
అది ఆత్మవంచనే గాని
సాంత్వన అగునా
గీత మీద గీత
ఆపైన మరో గీత
సమస్యల వలయమే కదా
మనస్వినీ

No comments:

Post a Comment