Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 17 July 2016

యుద్ధ క్షేత్రం

యుద్ధ క్షేత్రం 

ఇరువైపులా యుద్ధ ట్యాంకుల గర్జన
దూసుకువస్తున్న అగ్ని గోళాలు
పేలుతున్న మందుపాతరలు
ఆకాశవీధిలో లోహవిహంగాల విన్యాసాలు
జెట్ స్పీడ్ లో దూసుకువస్తూ
నేలను భస్మీపటలం చేస్తున్న బాంబులు
అంతటా హాహాకారాలు
ఎటు చూసినా విలయతాండవాలు
దట్టమైన పొగ
గుడ్డిదీపమూ లేని కటిక చీకటి
ఏ పక్షం ఎటునుంచి దాడి చేస్తుందో తెలియదు
ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేస్తూ
శాంతి సీమను నెత్తుటి నేలగా మారుస్తున్నారు
ఎవరు ఎందుకు దాడి చేస్తున్నారో
ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు
నాకు మాత్రం అంతా తెలుసు
దాడి చేసేది ఎవరో
బాధితులు ఎవరో నాకు తెలుసు
ఎందుకంటే అంతా నేనే
దాడి చేసే పక్షమూ నేనే
మరణించే వర్గమూ నేనే
సమరము చేస్తున్నది నా భావాలే
ఇది సిరియా యుద్ధ క్షేత్రం కాదు
నా మనోసీమలో జరుగుతున్న రణం
నా భావాలకు మానవరూపం ఉంటే
జరిగేది మారణహోమమే
నా హృదయం ఒక యుద్ధ క్షేత్రమే కాదా
మనస్వినీ

2 comments:

  1. అహో ఏమా ఘోరకలి బ్రదర్ రోజూ యుద్ధం చేయందే జరగదే లేవాలంటే యుద్ధం, మొహం కడగాలంటే యుద్ధం, తయారవ్వాలంటే యుద్ధం ఆఫీసుకు పోవాలంటే యుద్ధం..... బతుకే యుద్ధం కదా.... మరోమాటుంటే సెలవీ బ్రదర్.... సారీ నేను ఈ పోస్టు పెట్టడానిక్కూడా యుద్ధం చేశా... ఏమనుకుంటారో అని...చివరాకరికి పెట్టేశా.....

    ReplyDelete
    Replies
    1. నిజమే బ్రదర్ జీవనం సమస్తం సమరం..

      Delete