Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 4 July 2016

మరమనుషులే ముద్దు

మరమనుషులే ముద్దు

మనసు నిండా నవ్వులు నాకొద్దు
విరిసే పెదాల మాటున విషాదం తొలగించు
ముళ్ళను గుచ్చే పువ్వులు నాకొద్దు
కనులకింపైన ప్లాస్టిక్ పువ్వులే నాకు ముద్దు
కన్నీరు తుడిచే స్నేహం నాకొద్దు
కన్నీరే లేని కన్నులు నాకు ముద్దు
ఆసరాగా నిలిచే నేస్తం నాకొద్దు
వెన్నుపోటు తెలియని మరమనిషే నాకు ముద్దు
అన్నదమ్ముల ఆప్యాయతలు నాకొద్దు
ఆప్యాయంగా పలకరించే మట్టిమనుషులే నాకు ముద్దు
సలాములు చేసే గులాములు నాకొద్దు
మనసును గుర్తించే చిరునవ్వే నాకు ముద్దు
జిగేల్ మనిపించే వేడుకలు నాకొద్దు
గుడ్డిదీపంలో ఆనందాలే నాకు ముద్దు
పంచభక్ష్య పరమాన్నం నాకు వద్దు
ఆకలి తీర్చే పప్పన్నం నాకు ముద్దు
పరపతి పెంచే సిరిసంపదలు నాకొద్దు
తలదించని స్వాభిమానమే నాకు ముద్దు
నువ్వైనా నేనైనా
మనసున్న వారెవరైనా
ఆ దేవుడే దిగివస్తే కోరుకునేది
ఇంతేకదా
మనస్వినీ

No comments:

Post a Comment