Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 1 July 2016

మనసు దీపం

మనసు దీపం

కాటుక కన్నుల నల్లని రక్కసి
జడలు విప్పుతున్న వేళ
శశిని మింగిన నిశి
వలలు విసురుతున్న వేళ
మసిలాంటి నిశిలో
ఉషస్సు సమాధి అయ్యే వేళ
దేహానికి తప్ప దాహానికి పనికిరాని
కడలి కెరటాలు సునామీలైన వేళ
శూన్యం నుంచి మరో శూన్యంలోకి
అడుగులు వేసే వేళ
నిర్వేదమైన హృదయం  
చిరుకాంతికై కన్నులు తెరిచిన వేళ
కనుచూపు మేరలో
వెలుగేలేని వేళ
మౌన సంద్రమైన నా మనసు
నిన్నే కోరుకుంటుంది
నీ కన్నుల కాంతిని
జీవనరేఖలని మురిసిపోతుంది
నీ నవ్వుల వెలుగులను
గెలుపు బాటలని నమ్ముతుంది
చీకటి ముసిరిన మనసు
నీ మనసు దీపం పంచన చేరాలని
ఆ వెలుగుల నీడలో సేదతీరాలని
ఆరాటపడుతుంది
ముభావమైన నా మనసులో
భావాలు రేపే మనసు దీపం నీవే కదా
మనస్వినీ

No comments:

Post a Comment