Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 15 August 2015

మరణం అంచున ఆశలు

మరణం అంచున ఆశలు

మరలా వికసించాలని ఉంది
గాయపడిన మనసుకు
మమతల లేపనం అద్దాలని ఉంది
వాడిన పెదాలపై
చిరునవ్వునై
మెరవాలని ఉంది
ఆ కన్నులలో వెన్నెలనై
కురవాలని ఉంది
ఆ గాజుల గలగలలో
సవ్వడినై
చిందేయాలనీ ఉంది
ఆ అందియల లాస్యంలో
మువ్వనై మోగాలని ఉంది
మరలా వికసిస్తున్న
పెరటిలోని తులసిలో
మారాకునే కావాలని ఉంది
అందుకే
మరలా
వికసించాలని ఉంది
ఆ పాదాల కిందే
స్వర్గాన్ని వెతుక్కోవాలని ఉంది
నీ వికాసమే
నా వికాసం
నీ చిరునవ్వే నాకు జీవం
అబద్దం కాదు నా భావం
కహానీ కాదు నా కవిత్వం
మరణం అంచున చేరిన మనసు
చివరి అవకాశంగా
మరలా వికసించాలని
సమాయత్తమవుతోంది
మనస్వినీ

1 comment: