Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 7 August 2015

మనసులో మనసే

మనసులో మనసే

ఆలిలా పేరుపొందేవు
ఇల్లాలిలా హోదా వెలగబెట్టేవు
తల్లిలా కనిపించేవు
ఆస్తులను చూసి మురిసిపోయేవు
హక్కులు నావేనని మిడిసిపడేవు
బంధువులూ
రాబందులూ
అందరి ముందు వగచేవు
ఆడదానివన్న సానుభూతిని
పొందేవు
కన్నీరు కార్చేవు
అహంకారమే చూపేవు
మౌనమే దాల్చేవు
కపటనాటకాలే
రచించేవు
అన్నీ నాకే
అంతా నేనేనని
డాంబికాలకు పోయేవు
అన్నీ ఉన్నా
హక్కులు అనుభవిస్తున్నా
మనసులో మాత్రం
స్థానం పొందలేవు
మనసులో మనసువి కాలేని నీకు
ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే కాదా..
మనసులో ఉన్న మనసుకు
ఏమీ లేకున్నా
ఆమనసుకు అందరూ దూరమైనా
ఇల్లూ వాకిలి లేకున్నా
రాబందులు ఆదరించకున్నా
ఆ మనసుతో
సరితూగగలవా
అన్ని ఉండీ మనసులో లేని మనిషికంటే
మనసులో కొలువైన
మనసే గొప్పది కాదా

1 comment:

  1. అపురూపమైనది ఆడజన్మ అందుకే

    ReplyDelete