Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 21 August 2015

పరాజయ సాక్షి

పరాజయ సాక్షి


ఒక్కసారి గతంలోకి తొంగి చూసాను
నేటి నుంచి నాటిలోకి
పరకాయప్రవేశం చేసాను
ఒక వైభవం కదలాడింది
ఆనందం తొణికిసలాడింది
ఒక చల్లని తొలకరి పలకరించింది
ఎక్కడో కోయిల కూస్తోంది
పక్షుల కువకువలు
వీనుల విందు చేస్తున్నాయి
ప్రతి పువ్వూ నవ్వుతోంది
ప్రతి గుండె పులకరిస్తోంది
ఏదో తెలియని రాజసం
లీలగా కదులుతోంది
ప్రతి పలకరింపులో గౌరవం
ఏదో తెలియని అభిమానం
మనసుకు నచ్చిన మనసే లేకున్నా
అన్వేషణ నిరంతర వేదనే అయినా
అప్పుడు నా మనసు అలమటించలేదు
గుండె పగలలేదు
మనసులో వేదనను
కవితలుగా రాసుకున్నా
ఊహలుగా చెప్పుకున్నా
వసంతం మాత్రం వాడిపోలేదు
నా సామ్రాజ్యంలో రారాజుగానే
నీరాజనాలందుకున్నా
ఒక్కసారి గతం పరదాలు తీసేసి
ఇప్పుడు అనే లోకంలోకి
అడుగుపెడితే
ఏముంది
శిధిల వైభవం కళ్ళ ముందు నిలిచింది
పరాజయానికి సాక్షిగా

No comments:

Post a Comment