Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 12 May 2016

తేనీయపువ్వులు

తేనీయపువ్వులు 

తొలి పరిచయం
అది ఒక మధుర సంతకం
ఆ జ్ఞాపకాల దొంతరలు ఇంకా
మదిలో సుడులుగా తిరుగుతూనే ఉన్నాయి
ఆ అనుభవాల పువ్వులు
మనో సీమలో నిత్యం వికసిస్తూనే ఉంటాయి
నాకు బాగా గుర్తు
ఆ ఘడియలు
ఒక్క క్షణం కూడా గడిచినట్టు లేదు
నిత్యం సజీవంగానే ఉంది ఆ అనుభవం
తొలి స్పర్శతో మోములో మారిన రంగులు
ఇంధ్రధనుస్సును మరిపించలేదా
అటువైపు తిరిగిన నువ్వు
వణుకుతూనే విచ్చుకున్న నీ అధరాలు
మరువగలనా ఆ అనుభూతిని
ఆకురాలే కాలం పారిపోయి
నవవసంతం స్వాగతం పలికినట్లు
ఎండమావులు కరిగి
హిమనీదాలు పొంగినట్లు
ఎలా మరువగలదు మనసు
ఆ కన్నుల వెన్నెలని
మనసు పంచిన మమతలని
జీవనయాన గతిని మార్చిన
ఆ తొలి సంతకపు ఆనవాళ్ళు
సదా నా మనసులో
తేనీయపువ్వులుగా
పరిమళిస్తూనే ఉంటాయి
మనస్వినీ

No comments:

Post a Comment