Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 26 May 2016

మనోశిఖరం

మనోశిఖరం 

తన నీడలో తానే ఒదిగిపోయి
తటాకంలో ముడుచుకున్న కలువను
మబ్బులచాటు శశికిరణాలు
ఆర్తిగా తడిమితే
ప్రతిపత్రంలో ఏదో కొత్తజీవం
నవచైతన్యమైతే
ఆ దృశ్యం
సుందర మనోహరమే కాదా
రోహిణి భగభగలకు బీటలు వారిన పుడమిపై
అప్పుడే కురిసిన వానచినుకులు
సరససల్లాపాలు మొదలెడితే
సుగంధసువాసనలను మరిపించే
మట్టివాసనలు నలుదిశలా చెలరేగితే
ఆ అనుభవం
మరపురాని అనుబంధానికి
పసందైన సంకేతమే కాదా
ఆకురాలు కాలములో
మోడువారిన మానుకు
వసంతపు సొగసులు
మనసారా ముద్దులు పెడితే
ఒళ్ళు విరుచుకున్న మారాకులు
వనదేవతకు ప్రణామములు చేయవా
ప్రకృతిలోని ఈ వింత అనుభవాలు
నా మనసుకూ భావాలు నేర్పితే
శిథిలమైన మనో శిఖరానికి
నీ మనసు పునాదులు కడితే
నా మనసు
అనుబంధమై నిలిచిన నీ అనుభవాలకు
శిరస్సు వంచదా
మనస్వినీ

No comments:

Post a Comment